భీకర ఎన్ కౌంటర్... ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!

  • ఈ ఉదయం అనంతనాగ్ సమీపంలో ఎన్ కౌంటర్
  • ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వెళ్లిన సైన్యం
  • భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
జమ్మూ కశ్మీర్‌ లోని అనంతనాగ్‌ సమీపంలో ఈ ఉదయం భారత సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ చోటు చేసుకోగా, ఆరుగురు ఉగ్రవాదులను భద్రత బలగాలు మట్టుబెట్టాయి. శ్రీనగర్‌ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీజబెరా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు మకాం వేశారన్న సమాచారంతో సైన్యం సోదాలు ప్రారంభించిన వేళ, విషయం తెలుసుకున్న ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.

సైన్యం ఎన్ కౌంటర్ ను ప్రారంభించగా, ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారని, ఇంకా ఎన్‌ కౌంటర్‌ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని, వారి కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని, అదనపు బలగాలను రప్పించామని అన్నారు. మృతి చెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
Jammu And Kashmir
Terrorists
Encounter
Army

More Telugu News